0:00 ఒక పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్ అవ్వడం మీరు చూసిఉంటారు. అలాగే ఒక హీరో కొడుకు హీరో అవ్వడం కూడా చూస్తుంటారు. ఈరోజు ఈ వీడియోలో ఈ పాలిటిక్స్ సినిమాల్లో కన్నా ఎక్కువ నెపోటిజం ఉన్న మన న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. కింది కోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పరీక్షల ద్వారా జరిగితే హైకోర్టు సుప్రీం కోర్టులో జడ్జిల్ని కొలీజియం నియమిస్తుంది. జడ్జెస్ ని అపాయింట్ చేసే అధికారం మొత్తం సుప్రీం కోర్టుకే తీసుకోవాల్సిన అవసరం ఏమ వచ్చింది? ప్రపంచంలో ఎక్కడా ఇది లేదు. జడ్జెస్ నేనే చెప్పి జడ్జెస్ అపాయింట్ చేసే సిస్టం ప్రపంచంలో ఇంకఎక్కడ మన దేశంలో తప్ప ఇంక ఎక్కడ లేదు ఆధా సమయ జో దిమాగ సమయ అగలే జడ్జ్ కిస్కో బనానా హ ఉస్పే జాదా ఖర్చ హోనాకి అప్ పూరే సమయ న్యాయ దేనేమన్ జడ్జ్ తో బాజ్ బగఅపాయింట్మెంట్
0:48 [సంగీతం] ఆఫ్ జడ్జస్ఇస్నాట్ఏజడిషల్వర్క్ఇట్ఇస్పూర్ల [సంగీతం] అడ్మినిస్ట్రేటివ్ ఇన్ నేచర్ [సంగీతం] సుప్రీం కోర్ట్ మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం దేశంలో ఉన్న అన్ని కోర్టులు దీని కిందే పనిచేస్తాయి. ఈ సుప్రీం కోర్టుకి ఇంచార్జ్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యాయ వ్యవస్థలో ఈయన్ని మించిన పోస్ట్ లేదు. ఇదే హైయెస్ట్ పొజిషన్. మరి ఇంత పెద్ద పోస్ట్ కి ఒక వ్యక్తి సెలెక్ట్ అవ్వాలి అంటే ఆ ప్రాసెస్ ఎంత నిజాయితితో జరిగిఉండాలి కదా ఇది మన దేశంలోనే అత్యుత్తమమైన సుప్రీం కోర్టు కి పనిచేసిన చివరి 15 మంది సిజేఐల లిస్ట్ మనకు 51వ సిజేఐ గా సంజీవ్ కన్నా గారు పని చేశారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ని గనుక
1:34 ఒక్కసారి చూస్తే ఆయన తండ్రి దేవరాజ్ కన్నా ఒక రిటైర్డ్ జడ్జీ ఆయన మామ హంసరాజ్ కన్నా ఈయన కూడా సుప్రీం కోర్టులో జడ్జీగా పని చేశాడు. దాంట్లో తప్పేముంది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మంచి టాలెంటెడ్ అయి ఉంటారు. అందుకే ఇంతమంది సుప్రీం కోర్టు కి సెలెక్ట్ అయ్యారు అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏందంటే నార్మల్ గా ఎవరికీ ఎక్కువ సీనియారిటీ ఉంటే వాళ్ళని సుప్రీం కోర్టు కి సిజేఐ ని చేస్తారు. కానీ సంజీవ్ కన్నాను సిజేఐ గా చేయడానికి ఆయనకన్నా సీనియర్ గా ఉన్న 32 మంది జడ్జీలను కాదని మరి ఈయన్ని సిజేఐ గా చేయడం జరిగింది. అంతేకాదు సంజీవ్ కన్నా సుప్రీం కోర్ట్ సిజేఐ అవ్వడానికి ముందు ఆయనకు ఏ హైకోర్టులో కూడా సిజేఐ గా పని చేసిన అనుభవం కూడా లేదు. అయినా సరే ఆయన్ని ఫస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జీని చేయడం జరిగింది ఆ తర్వాత సుప్రీం కోర్టు కి సిజేఐ చేయడం జరిగింది. ఈయనకు ముందు సిజేఐ గా పని
2:20 చేశారు దేశంలోనే వన్ ఆఫ్ ద పాపులర్ జడ్జి చంద్రచూడ్ గారు. ఈయన తండ్రి వైవి చంద్రచూడ్ గారు కూడా ఒకప్పుడు ఇండియాకి సిజేఐ గా పని చేశారు. చంద్రచూడ్ గారి తండ్రి వైవి చంద్రచూడ్ గారు సుప్రీం కోర్ట్ సిజేఐ గా ఉన్నప్పుడు ఈ బిఎన్ కృపాల్ అనే ఆయన్ని బాంబే హైకోర్టులో జడ్జీని చేసిండు. ఈ బిఎన్ కృపాల్ అనే ఆయన కొన్ని రోజుల తర్వాత వై వి చంద్రచూడ్ గారి కొడుకైన డివై చంద్రచూడ్ ని బాంబే హైకోర్టులో జడ్జిని చేసిండు. కొన్ని రోజుల కిందట డివై చంద్రచూడ్ గారు బిఎన్ కృపాల్ గారి కొడుకైన సౌరబ్ కృపాల్ ని ఢిల్లీ హైకోర్టుకు జడ్జీగా సిఫారస్ చేసిండు. చంద్రచూడ్ గారి కన్నా ముందు లలిత్ గారు సిజే గా పనిచేశారు. ఈయన తండ్రి గారు కూడా ఒక జడ్జీ. మీరు గనుక అబ్సర్వ్ చేస్తే సుప్రీం కోర్టు కి సిజేఐ గా పనిచేసిన లాస్ట్ 15 మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకంగా న్యాయ వ్యవస్థ బ్యాక్ గ్రౌండ్
3:06 ఉన్నవాళ్లే ఉన్నారు. అయితే వాళ్ళ పేరెంట్సో లేకపోతే చుట్టాలో ఎవరో ఒకరు అంతకు ముందు నుంచే జుడిషియరీలో మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్లే ఉన్నారు. నేను చెప్తున్నది ఏదో చిన్న చితకా పదవుల్లో కూర్చున్న వాళ్ళ గురించి కాదు దేశ న్యాయ వ్యవస్థలోనే అత్యున్నతమైన భారత ప్రధాన న్యాయమూర్తి అనే కుర్చీలో కూర్చున్న వాళ్ళ గురించి ఇంత పెద్ద పోస్ట్‌లో కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ అవుతున్నారు. కేవలం గతంలో సెలెక్ట్ అయిన వాళ్లే కాదు భవిష్యత్తులో సిజేఐ అవ్వబోతున్న వాళ్ళలో కూడా మీకు ఇదే పాటర్న్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ బివి నాగరత్న గారు సుప్రీం కోర్టు ఏర్పడై 75 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా సిజేఐ అవ్వలేదు. జస్టిస్ బివి నాగరత్న గారు 2027 లో మన దేశానికి మొట్టమొదటి మహిళా సిజేఐ గా అవ్వనున్నారు. ఒకసారి ఈమె ఫ్యామిలీ
3:52 బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఈమె తండ్రి ఈవి వెంకటరామయ్య. ఈయన ఇండియాకి 19 వ సిజేఐ గా పనిచేశాడు. ఇంత పెద్ద భారతదేశంలో అది కూడా మొట్టమొదటి మహిళా సిజేఐ పోస్ట్ కి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అర్హతలు ఉన్నవాళ్ళు ఒక్కళ్ళ కూడా లేరా మీరు వరల్డ్ లోని టాప్ యూనివర్సిటీలో చదివినా సరే మన దేశంలో జడ్జీ అవుతారో లేదో చెప్పడం చాలా కష్టం. కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా జుడిషియరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటే గనుక మీరు ఖచ్చితంగా ఈజీగా జడ్జీ అయిపోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఇదే నడుస్తుంది. తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనమడు. ఈ కుటుంబ పాలన ఒక్క సుప్రీం కోర్టులోనే కాదు హైకోర్టులో కూడా పాతుకుపోయింది. 2015 లో మత్యూస్ నెడుంపరా అనే జడ్జీ మాట్లాడుతూ దేశంలోని హైకోర్టులలో 50% జడ్జీలు సుప్రీం కోర్టులో ఉన్న 33% జడ్జీలు జస్ట్ ఫ్యామిలీ
4:37 బ్యాక్‌గ్రౌండ్ ని యూస్ చేసుకొని ఆ స్థానాల్లోకి వచ్చారని చెప్పాడు. ఇండియా టుడే 2023 లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం 22 హైకోర్టులలో దాదాపు 100కు పైగా జడ్జీలు తమ తల్లిదండ్రులు లేదా బంధువుల ద్వారా జడ్జీ పదవిని పొందారు. దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో నెపోటిజం ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ లిస్ట్ చూడండి. ఎంతమంది ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు జడ్జీలు అయ్యారు. తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనమడు. నిజానికి సినిమాలు పాలిటిక్స్ కన్నా ఎక్కువ నెపోటిజం మన న్యాయ వ్యవస్థలో ఉంది. ఈ నెపోటిజం వల్ల కొత్త వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా జడ్జీ అవ్వలేకపోతున్నారు. మీరు ఇండియాలో ఏ జాబ్ అయినా తీసుకోండి ఈ క్యాస్ట్ కి ఇన్ని పోస్టులు ఈ క్యాస్ట్ కి ఇన్ని పోస్టులని రిజర్వేషన్ ఉంటుంది. మరి రిజర్వేషన్లనే కాపాడే న్యాయ వ్యవస్థలో ఏ క్యాస్ట్ నుంచి ఎంతెంత మంది జడ్జీలు అయ్యారో తెలుసా? 2018
5:25 నుంచి ఇప్పటి వరకు అన్ని హైకోర్టులకు కలిపి 715 మంది జడ్జీలు సెలెక్ట్ అవుతే అందులో 551 మంది అంటే 77% జస్ట్ అప్పర్ కాాస్ట్ వాళ్లే ఉన్నారు. 12% ఓబిసి ఎస్స నుంచి 2% ఎస్టీ నుంచి 5% ఉన్నారు. ఈ లెక్కలు చూసిన తర్వాత అసలు దళితుల్లో జడ్జీ అవ్వగలిగే టాలెంట్ ఉన్నోళ్లే లేరా అనే డౌట్ వస్తుంది. నార్మల్ గా మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అన్నా తీసుకోండి ఎగ్జామ్ ఉంటది ఇంటర్వ్యూ ఉంటది. వాటిని క్లియర్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తది. కానీ ఎంతో మంది జీవితాలను ఒక్క తీర్పుతో డిసైడ్ చేసే హైకోర్ట్ సుప్రీం కోర్ట్ జడ్జీ పోస్టులకు మాత్రం ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు. మరి ఒక జడ్జీని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటారా కొలీజియం అనే ఐదుగురు వ్యక్తుల గ్రూప్ ఉంటుంది. దీంట్లో ఒక సిజేఐ నలుగురు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఉంటారు. ఈ ఐదుగురు కలిసి నెక్స్ట్ సుప్రీం కోర్టులో ఎవరిని జడ్జీగా
6:11 చేయాలో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలో ఎవరిని సిజేఐ గా చేయాలో డిసైడ్ చేస్తారు. హైకోర్టులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఈ గ్రూప్ నెక్స్ట్ ఎవరిని జడ్జీగా చేయాలో కొన్ని పేర్లని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పంపిస్తుంది. అప్పుడు గవర్నమెంట్ దాంట్లో నుంచి కొన్ని పేర్లని యాక్సెప్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతి వాళ్ళని జడ్జీలుగా నియమిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఒక్కసారి కొలీజియం ప్రభుత్వానికి లిస్ట్ పంపిన తర్వాత వీళ్ళని మేము జడ్జీలుగా యాక్సెప్ట్ చేయలేమని పూర్తిగా తిరస్కరించే హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఆ లిస్ట్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అంతే తప్ప ఆ పేర్లని రిజెక్ట్ చేసే హక్కు లేదు. ఒకవేళ కొలీజియం పంపిన పేర్లని గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ రెండోసారి కూడా అదే పేర్లని గవర్నమెంట్ కి పంపే రైట్ కొలీజియం కి ఉంది. అలా కొలీజియం గనుక ఒక వ్యక్తి పేరుని రెండోసారి గనుక గవర్నమెంట్ కి పంపితే దాన్ని రిజెక్ట్
6:57 చేసే హక్కు గవర్నమెంట్ కి కూడా లేదు. గవర్నమెంట్ కి ఇష్టం లేకపోయినా సరే యక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా ఎలాంటి ఎగ్జామ్, మెరిట్ ఇంటర్వ్యూ లేకుండా జడ్జీలని జడ్జీలే సెలెక్ట్ చేసుకునే పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క మన దేశంలో తప్ప ఈ కొలీజియం ఏ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని జడ్జింగ్ చేస్తుందో ఏ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని జడ్జీ అవ్వకుండా తిరస్కరిస్తుందో ఆ వివరాలు ఆ దేవుడికి కూడా తెలియవు ఈ ప్రాసెస్ మొత్తం రహస్యంగా నాలుగు గోడల మధ్యలో జరుగుతుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే నిజానికి ఈ కొలీజియం గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో అసలు ఈ కొలీజియం అనే పదమే లేదు. మరి ఈ కొలీజియం అనే పద్ధతి మన న్యాయ వ్యవస్థలోకి ఎలా వచ్చింది అనేది మనం కొద్దిసేపు అయ్యాక మాట్లాడుకుందాం. సమాజంలో ఎవ్వరు తప్పు చేసినా సరే న్యాయమూర్తులు వాళ్ళకి శిక్షలు వేస్తారు.
7:44 మరి న్యాయమూర్తులే తప్పు చేస్తే అసలు వాళ్ళకి శిక్షలు పడతాయా అంటే కొన్ని రోజుల కిందట ఢిల్లీ హైకోర్ట్ జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరి సుప్రీం కోర్ట్ కొలీజియం అతని మీద ఏం చర్యలు తీసుకుంది అంటే అతన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేసింది. 2011 లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సుమిత్రాసేన్ 35 లక్షల రూపాయలు దారి మల్లించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ వేసిన విచారణ కమిటీ కూడా ఈయన తప్పు చేశాడని చెప్పింది. అయినా సరే కొలీజియం ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సిక్కిం సిజేఐ పిజీ దినకర్ ఈయన తమిళనాడులోని కాంచీపురంలో భూ కబ్జాలు చేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. విచారణలో కూడా ఈయన తప్పు చేశాడని తేలింది. అయినా సరే ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు ఈయన్ని. 2019 లో సుప్రీం కోర్టులో అసిస్టెంట్ గా పనిచేస్తున్న 35
8:30 సంవత్సరాల అమ్మాయి జడ్జీ అయిన రంజన్ గోగోయ్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. నార్మల్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటవు. ఈ కేసులో కూడా జడ్జీ రంజన్ గోయి తప్పు చేశాడా లేదా తెలుసుకోవడానికి ముగ్గురు వ్యక్తుల కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ హెడ్ ఎవరు జడ్జీ రంజన్ గోయి ఆ అమ్మాయి చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు ఇదంతా ఒక కుట్ర అని తన కేసుని తానే వాదించుకొని తానే తీర్పు చెప్పుకున్నాడు. ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ 2017 నుంచి 21కి మధ్య నాలుగు సంవత్సరాల్లో మీ జడ్జీలు తప్పు చేస్తున్నారని చెప్పి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివిధ కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు 1630 ఫిర్యాదులు వచ్చాయి. మరి కొలీజియం వీటిలో ఎంతమంది జడ్జీల మీద విచారణ చేసింది ఎంతమందికి శిక్షలు వేసింది ఏం యాక్షన్
9:16 తీసుకుంది అనేది ఎవ్వరికీ తెలీదు. మన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తప్పు చేసినా సరే ప్రజలు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు ద్వారా శిక్షించే అవకాశం ఉంది. ఐఏఎస్ ఐపిఎస్ లాంటి అధికారులు తప్పు చేసినా సరే వాళ్ళని సర్వీస్ నుంచి తీసేస్తారు. కానీ ఒక జడ్జీ అవినీతికి పాల్పడితే అతన్ని పదవిలోంచి తీసేయడం అంత ఈజీ కాదు. ఒక జడ్జీని పదవిలో నుంచి తీసేయాలి అంటే దానికి కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు ఒక పిటిషన్ మీద సంతకాలు చేయాలి. ఆ పిటిషన్ ఓకే అయితే అప్పుడు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాట అవుతది. ఈ కమిటీ ఆ జడ్జీ తప్పు చేశాడో లేదో విచారిస్తుంది. ఒకవేళ ఆ విచారణలో జడ్జీ తప్పు చేశాడని తేలితే దాని తర్వాత ఆ బిల్లు రెండు సభల్లోనూ 3/2 మెజారిటీతో పాస్ అవ్వాలి. అప్పుడు రాష్ట్రపతి ఆ జడ్జీని తీసేయమని ఆర్డర్ ఇస్తాడు. ఈ
10:02 ప్రాసెస్ అంతా జరిగే వరకు ఆ జడ్జీ పదవీ కాలం కూడా అయిపోయి రిటైర్ అయిపోతాడు. అందుకే భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క జడ్జీని కూడా పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ద్వారా తీసేయలేదు. అంటే ఈ సిస్టం ఉంది అని చెప్పడానికి మాత్రమే ఉంది యూస్ చేయడానికి కాదు. ఒకవేళ జడ్జీ గనుక మీ కేసులో తప్పుడు తీర్పిస్తే నువ్వు పైన కోర్టులో అపీల్ చేసుకోవాలి తప్ప ఎందుకు కరెక్ట్ తీర్పు ఇవ్వలేదు అని అడగడానికి నీకు హక్కు ఉండదు. ఆయన మీద మనం ఒక కేసు కూడా పెట్టలేము. ఒక జడ్జీ మీద మనం ఫిర్యాదు చేయాలంటే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ మనలాంటి సామాన్యులకు ఇది ఎంత ఈజీయో మీరే అర్థం చేసుకోండి. మనమే కాదు ఆఖరికి ప్రభుత్వం కూడా ఒక సిట్టింగ్ జడ్జీ మీద దర్యాప్తు చేయాలంటే కచ్చితంగా సిజేఐ పర్మిషన్ తీసుకోకుండా చేయడం కుదరదు. ఒక జడ్జీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి
10:48 కూడా రాష్ట్రపతి గవర్నర్ అనుమతి కావాలి. న్యాయ వ్యవస్థకు రక్షణ కల్పిస్తారని రాజ్యాంగం జడ్జీలకు ఇన్ని పవర్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇవే పవర్స్ ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారు కొందరు. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని నేను చెప్పడం కాదు డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ జడ్జీలే చెప్తున్నారు. సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జీల్లో 50% మంది అవినీతిపరులే ఉన్నారని చెప్పేసి స్వయంగా సుప్రీం కోర్ట్ జడ్జీ మార్కండేయ ఖర్జు గారు అన్నారు. 2017 లో కోల్కత్తా హైకోర్ట్ జడ్జీ జస్టిస్ కర్ణన్ గారు 33 మంది అవినీతిపరులైన జడ్జీల పేర్లతో కూడిన ఒక లెటర్ ని ప్రధానమంత్రికి రాశాడు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నా దగ్గర చాలా మంది జాతకాలు ఉన్నాయని ఆయన ఈ లెటర్ లో చెప్పాడు. 2009లో ఫేమస్ సుప్రీం కోర్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇండియాకు పనిచేసిన చివరి 16 17 మంది సిజేఐలో సగం మంది
11:35 అవినీతిపరులే అని కోర్టులో అఫిడవిట్ వేశడు. ఈయన కరప్టెడ్ అని చెప్తుంది ఏదో చిన్న చికా జడ్జీల గురించి కాదు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్ట్ సిజేఐలలో సగం మంది కరప్టెడ్ అని ఏం చెప్పాడు. అప్పుడు సుప్రీం కోర్ట్ మమ్మల్నే కరప్టెడ్ అంటావా అయితే నీ మీద కేస్ పడాల్సిందే అని చెప్పేసి ఈయన మీద కోర్టు అధికార నేరం కింద కేస్ వేసింది. నువ్వు చేసిన ఆరోపణలకి ప్రూఫ్‌లు చూపించమని చెప్పి సుప్రీం కోర్ట్ ప్రశాంత్ భూషణ్ ని అడిగింది. అప్పుడు ప్రశాంత్ భూషణ్ కోర్టుకి ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేశాడు. ఆ డాక్యుమెంట్ ని నేను ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. కానీ ఆ డాక్యుమెంట్ చదివితే మీరే అంటారు. మన సుప్రీం కోర్టులో ఇంత అవినీతి ఉందా అని చెప్పి దారుణమైన కరప్షన్ న్యాయ వ్యవస్థ ఎంత చీకట్లో ఉందో టార్చ్ చేసి మరి ఎక్స్పోజ చేశాడు. దెబ్బకి సుప్రీం కోర్టే ఈయన మీద వేసిన కేసుని కొట్టేయాల్సి
12:21 వచ్చింది. మన న్యాయ వ్యవస్థలో ఉన్న మూడు మెయిన్ ప్రాబ్లమ్స్ కరప్షన్, నెపోటిజం, మితిమీరిన పవర్స్ ఈ మూడింటికి కారణమైన కొలజిన్ వ్యవస్థ అసలు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1970 కి ముందు జడ్జీల అపాయింట్మెంట్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ వరకు అన్ని విషయాలు ప్రభుత్వం కంట్రోల్ లో ఉండేవి. మన రాజ్యాంగంలో కూడా జడ్జీలను రాష్ట్రపతి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సలహా తీసుకొని నియమిస్తాడని ఉంది. నెక్స్ట్ ఎవరిని జడ్జీగా చేయాలో సిజేఐ రాష్ట్రపతికి చెప్పేవాడు. ఒకవేళ ప్రెసిడెంట్ అతన్ని రిజెక్ట్ చేస్తే సిజేఐ ఇంకొక పేరుని రాష్ట్రపతికి చెప్పేవాడు. అలా ఆ లిస్టులో ఎవరికి ఎక్కువ సీనియారిటీ ఉంటే వాళ్ళని సిజేఐలుగా జడ్జీలుగా సెలెక్ట్ చేసేవారు. 1973 లో ఇందిరా గాంధీ గవర్నమెంట్ వచ్చింది. ఈ సీనియారిటీ గీనియారిటీ అన్నిటిని పక్కన పెట్టేసి నచ్చినోళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్నోళ్ళని జడ్జీలుగా చేయడం
13:08 స్టార్ట్ చేసింది. అలా రెండు సార్లు జరిగింది. కేశవానంద భారతి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పేసి సీనియారిటీ ప్రకారం నియమించాల్సిన ఈ ముగ్గురు న్యాయమూర్తులని పక్కన పెట్టి నాలుగో స్థానంలో ఉన్న జడ్జి ఏఎన్ రేని సిజేఐ చేసింది కాంగ్రెస్. ఏడిఎన్ జబల్పూర్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పేసి జస్టిస్ హంసరాజ్ కన్నాను సిజేఐ గా చేయకుండా జస్టిస్ ఎం హెచ్ బేగ్ ను సిజేఐ చేసింది. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ జడ్జీ తీర్పిచ్చినా సరే ఇందిరా గాంధీ గవర్నమెంట్ వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేది. అలా ఎమర్జెన్సీ టైంలో ఇందిరా గాంధీ ఏకంగా 16 మంది జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసింది. జడ్జీలు అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పాలి లేదా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవాలి. ఇంకో ఆప్షనే లేదు. ప్రభుత్వం ఇలా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల న్యాయ వ్యవస్థలో ఒక
13:54 రకమైన భయం స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కొనసాగితే న్యాయ వ్యవస్థ మొత్తం ప్రభుత్వానికి బానిస అయిపోతుందని ఏదైనా చేయాలి అని జడ్జీలంతా అనుకుంటున్న టైంలోనే ఇందిరా గాంధీ గారు చనిపోయారు. కరెక్ట్ గా అదే టైంలో ఒక కేస్ వచ్చింది. సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇప్పటికి ముందొక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఇప్పటి నుంచి ప్రభుత్వం ఎవరిని పడితే వాళ్ళని జడ్జీలుగా నియమించడం కుదరదు. ఇప్పటి నుంచి సిజేఏఐ బాస్ అతను మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ఎవరిని నెక్స్ట్ కి జడ్జీగా చేయాలో గవర్నమెంట్ కి సిఫారస్ చేస్తాడు. అతను ఎవరినైతే సిఫారసు చేశాడో వాళ్ళని మాత్రమే రాష్ట్రపతి నియమించాలి అని తీర్పు చెప్పింది. ఈ తీర్పు తర్వాత కొలీజియం ఎంత పవర్ఫుల్ అయిందంటే ప్రభుత్వం కూడా జుడిషియరీ అపాయింట్మెంట్స్ లో ఎంటర్ అవ్వలేకపోయింది. అలా ఒక రకంగా ఈ కొలీజియం
14:40 వ్యవస్థ ఇందిరా గాంధీ వల్ల వచ్చిన భయం, కోపం, అసహనం వల్ల వచ్చింది. మరి ఈ తీర్పు తర్వాత జడ్జీలను సెలెక్ట్ చేసే పవర్ ని కోల్పోయిన గవర్నమెంట్ ఊరికినే ఉందా అంటే 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొలజియం వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి ఎన్‌జేఏసి నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనే ఒక బిల్ ని తీసుకురావడానికి ట్రై చేసింది. ఈ ఎన్‌జేఏసి లో ఆరుగురు సభ్యులు ఉంటారు. న్యాయ వ్యవస్థ నుంచి ముగ్గురు, ఒక సిజేఐ ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు. ప్రభుత్వం నుంచి ముగ్గురు. ఒక కేంద్ర న్యాయమంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు. ఈ ఆరుగురు కలిసి సుప్రీం కోర్టులో హైకోర్టులో ఎవరెవరిని జడ్జీలుగా చేయాలో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలో డిసైడ్ చేస్తారు అని కేంద్రం చెప్పింది. వీరిలో ముగ్గురు వ్యక్తులు జుడిషరీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ద్వారా ఎంపికైన వాళ్లే అంటే జడ్జీల నియామకాలలో ప్రభుత్వం సగం వంతు పాత్రను తన చేతుల్లోకి
15:27 తీసుకుంటుందన్నమాట. ఈ బిల్లుకు అన్ని రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ సుప్రీం కోర్ట్ జడ్జీల నియమకాల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ బిల్లును కొట్టేసింది. రీసెంట్ గా చాలా మంది ఈ కొలీజియం వ్యవస్థను రద్దు చేసి జడ్జీలను నియమించే పవర్ ని ప్రభుత్వానికి ఇవ్వాలని అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాకపోవచ్చు. మన దేశంలో 43% మంది రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఇంతమంది నేరస్తులు ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి వీళ్ళు నిజాయితీగా ఒక న్యాయ వ్యవస్థను హ్యాండిల్ చేస్తారని నమ్మడం చాలా కష్టం. ప్రభుత్వం దగ్గర పవర్ ఉంటే ఎంత విద్వంసం జరిగిందో ఆల్రెడీ మనం ఇందిరా గాంధీ టైం లోనే చూసాం కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాని కొలీజియం వ్యవస్థ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. కొలజియం వ్యవస్థలో నెపుటిజం అవినీతి లాంటి
16:12 చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదనట్లేదు కానీ వాటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. జపాన్ లో జడ్జీలను కఠినమైన ఎగ్జామ్స్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. సేమ్ అలాగే మన దగ్గర కూడా జడ్జీలని ఎంపిక చేయడానికి ఒక ఎగ్జామ్ లాంటిది ఉండాలి. ఇంటర్వ్యూ లాంటిది ఉండాలి. లేదు మేము అలాగే పాత పద్ధతిలో చేస్తామంటే ఒక జడ్జీని ఏ కారణాల వల్ల సెలెక్ట్ చేశారో ఒక జడ్జీని ఏ కారణాల వల్ల రిజెక్ట్ చేశారో ఆ వివరాలన్నిటిని కొలీజియం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తున్నారో తప్పు చేసిన వాళ్ళు హైకోర్ట్ జడ్జీ అయినా సరే సుప్రీం కోర్ట్ జడ్జీ అయినా సరే కొలీజియం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే కదా సాధారణమైన జనాలు మిమ్మల్ని నమ్మేది. అంతేకాదు తండ్రిడి కొడుకు మామను అల్లుడు జడ్జిగా చేసే ఈ విధానాన్ని రద్దు చేయాలి. మహిళలకు సమాన అవకాశాలు అని చెప్పే
16:57 సుప్రీం కోర్టే ఆ రూల్ ని ఫాలో కావాలి. ఈ మార్పులన్నిటిని తీసుకురాగలిగే శక్తి ఒక్క సుప్రీం కోర్ట్ కొలీజియం కు మాత్రమే ఉంది. ఇంకెవరి వల్ల ఇది సాధ్యం కాదు. ఇవన్నీ కరెక్ట్ అయిన రోజు న్యాయ వ్యవస్థని వేలెత్తి చూపించే ధైర్యం కూడా ఎవరూ చేయరు. ఈ వీడియో చేయడం ద్వారా కొలీజియం వ్యవస్థను విమర్శించడం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు యొక్క విలువలని తగ్గించడం ఇవి నా ఇంటెన్షన్ కాదు ఒక సామాన్యుడికి చిట్టచివరి ఊపిరి న్యాయ వ్యవస్థ ఇది స్వతంత్రంగా నిజాయితిగా ఉన్నన్ని రోజులే దేశానికి వెలుగులు నేను నా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిజాయితిగా పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మరి కొలీజియం తనని తాను మార్చుకుంటుందా లేదా చూడాలి. ఇది వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం
17:44 మాత్రం మర్చిపోకండి.