0:00 వేద పురాణాల్లో మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తూ ఉంటారు అలాంటి ఈ పురాణంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి వీటిలో మనందరికీ తెలిసిన పాత్రలే కాకుండా షాకింగ్ గా మెస్మరైజింగ్ గా ఉండే క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ జరాసంధుడు గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎవరైనా సరే ఈ భూమి మీదకు వచ్చే ముందు ఒకే తల్లి గర్భంలో ఉంటారు కానీ ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగి పుట్టినప్పుడేమో రెండుగా విడిపోయినటువంటి శరీర భాగాలతో పుట్టి అతి పరాక్రమవంతుడిగా మారినటువంటి ఈ వీరుడి కథ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా బర్త్ అండ్ ఎర్లీ లైఫ్ పూర్వం మగధ సామ్రాజ్యాన్ని బృహద్రదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి ఇద్దరు
0:47 భార్యలు వీళ్ళు కాశీ రాజుకు పుట్టిన కవల కూతుర్లు వీళ్ళిద్దరిని సమానంగా ప్రేమిస్తాను అని బృహద్రదుడు భార్యలు ఇద్దరికీ మాట ఇస్తాడు అయితే ఎన్ని మంగళ కార్యాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా సరే అతడికి పిల్లలు పుట్టలేదు ఒకసారి చండ కౌశికుడు అనే ముని వీరి రాజ్యానికి వస్తాడు పుత్రున్ని ప్రసాదించమని రాజు ఆ మునిని ప్రార్థిస్తాడు ముని ధ్యానం చేయడం మొదలు పెడతాడు కొంతసేపటికి ఒక మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడుతుంది దాన్ని మంత్రించి రాజు చేతికి ఇస్తాడు అతడు ఆ పండును తీసుకెళ్లి భార్యల చేతిలో పెడతాడు భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్ళు ఆ పండును రెండు సగాలు చేసి తింటారు ఆ తర్వాత ఇద్దరు భార్యలు గర్భాన్ని పిలుస్తారు కొంతకాలానికి రాణులు ఇద్దరూ
1:33 సగం పండును తినడం వల్ల సగం శరీరాలు ఉన్న శిశువులకు జన్మనిస్తారు ప్రాణం లేని ఆ శిశువు యొక్క రెండు శరీర భాగాలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి వాటిని అడవిలో పడేయమని బృహద్రదుడు ఆదేశిస్తాడు రాజు ఆదేశానుసారం ఆ శిశువులిద్దరిని బటులు అడవిలో పడేసి వస్తారు అదే అడవిలో జర అనే ఒక రాక్షసి సంచరిస్తూ ఉండేది ఒకసారి నరమాంసం కోసం వెతుకుతున్న ఆ రాక్షసికి ఈ శిశువులు ఏడుస్తూ కనిపిస్తారు చూడ్డానికి ముద్దుగా కనిపిస్తున్న ఆ శిశువుల్ని చంపబుద్ది కాలేదు ఆమెకి వెంటనే వాళ్ళిద్దరిని చేతిలోకి తీసుకోగా ఊహించని విధంగా రెండు ముక్కలు కలిసిపోయి సజీవంగా ఉండేటువంటి ఒక బిడ్డ లాగా మారుతాయి వెంటనే ఆ శిశువు అత్యంత శక్తివంతంగా మారి పెద్దగా కేకలు
2:19 వేయడంతో జర చాలా భయపడిపోతుంది బతికి ఉన్న బిడ్డను తినడానికి ఎంతైనా సరే ఆమె మనసు ఒప్పుకోదు వెంటనే జర ఆ శిశువును రాజు దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా చెప్తుంది ఆ శిశువు మరెవరో కాదు తన బిడ్డే అని తెలుసుకున్నటువంటి బృహద్రధుడు తన కుమారున్ని చూసి ఎంతో సంతోషిస్తాడు అందుకు కృతజ్ఞతగా జరా పేరు కలిసి వచ్చేలాగా తన బిడ్డకి జరాసంధుడు అనే పేరు పెడతాడు ఇక్కడ జర అంటే రాక్షసి పేరు సంధ అంటే చేరడం సో జరాసంధ అంటే జరచే చేరిన వాడు అని అర్థం వస్తుంది తర్వాత కొద్ది రోజులకు చండకౌశికుడు మళ్ళీ బృహద్రదుని ఆస్థానానికి వస్తాడు బృహద్రదుడి కుమారుని చూసి ఈ పిల్లవాడు వాడు గొప్ప శివ భక్తుడిగా ఎదుగుతాడు అని ఊహిస్తాడు ఆయన చెప్పినట్టే
3:04 జరాసంధుడు గొప్ప శివ భక్తుడు అవుతాడు అంతేకాదు దాన ధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు అంటే అడిగిన వాళ్ళకి కాదనకుండా విరివిగా దానాలను చేసేవాడు యుక్త వయసులోకి రాగానే జరాసంధుడు అత్యంత బలవంతుడిలా మారుతాడు మగధ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత గిరివ్రజరాన్ని రాజధానిగా చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు ఎదుటివాడు ఎంత బలసంపన్నుడైనా సరే అతడి బలాన్ని హరించే శక్తి కలిగి ఉంటాడు ఏ ఆయుధంతోను చావురాని విధంగా శివుని నుండి వరం పొందినటువంటి హంస డింబకులు అనే రాక్షసుల్ని మిత్రులుగా చేసుకుంటాడు వారి సాయంతో ఎన్నో రాజ్యాలని గెలిచి తన సామ్రాజ్యంలో కలిపేసుకుంటాడు ఇలా రోజు రోజుకి అతడి శక్తి పెరుగుతూనే ఉంటుంది
3:49 కానీ వారసులు లేకపోవడంతో భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాడు తర్వాత కాన్ఫ్లిక్ట్స్ విత్ బలరామ అండ్ కృష్ణ జరాసంధుడికి ఆస్తి ప్రాప్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉంటారు మధురని పరిపాలించే కంసుడు జరాసంధుడి దృష్టిని ఆకర్షిస్తాడు అతడి ధైర్య సాహసాలకు ముగ్దుడై తన ఇద్దరు కుమార్తెలను అతడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇది ఇలా ఉంటే కొంతకాలానికి కంసుడు తన చెల్లెలు దేవకీ కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చనిపోతాడు అని తెలుసుకుంటాడు అందుకే భయంతో ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని వరుసగా చంపడం మొదలు పెడతాడు కానీ చివరికి అనుకోని విధంగా మల్ల యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతాడు దాంతో తన కూతుర్లిద్దరూ ఒకేసారి విధవలు అయిపోతారు తండ్రి దగ్గరికి వెళ్లి మా
4:34 భర్తను చంపిన వాడిని చంపి ప్రతీకారం తీర్చుకోమని జరాసంధుడిని కోరుకుంటారు తన కుమార్తెల పరిస్థితి చూసి జరాసంధుడికి కోపం వస్తుంది ఆ తర్వాత జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు వెంటనే 23 అక్షోహీనుల సైన్యంతో మధుర మీద దాడి చేస్తాడు కానీ కృష్ణుడు బలరాముడు కలిసి జరాసంధుడు అతడి సైన్యాన్ని తిప్పికొడతారు అంతటితో ఊరుకో కుండా మళ్ళీ మధుర మీద దాడికి దిగుతాడు ఆ తర్వాత కూడా అతని సైన్యాన్ని తిప్పికొడతారు ఇలా జరాసంధుడు మధురపై వరుసగా 17 సార్లు దాడి చేసి ప్రతిసారి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోతాడు అయితే ఇలా దాడి చేసిన ప్రతిసారి జరాసంధుడి సైన్యాన్ని అయితే తిప్పికొడుతున్నారు కానీ మధురలోని ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు సో తన
5:22 రాజ్యంలోని ప్రజల ఇబ్బందుల్ని గమనించిన శ్రీకృష్ణుడు ఇక ఎక్కువ కాలం తన రాజ్యాన్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదని ఊహించుకుంటాడు అందుకోసం వెంటనే మరో చోటకి మార్చాలి అనుకుంటాడు వెంటనే దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు మధురలో ప్రజలందరినీ ద్వారక అనే ఒక కొత్త నగరానికి తీసుకెళ్తాడు ఇక తర్వాత జరాసంధుడు చేసినటువంటి 18 వ దాడి సమయంలో అతడు మధుర నగరాన్ని తగలబెట్టేస్తాడు ఆ మంటల్లో పడి బలరామకృష్ణులు కూడా చనిపోయి పోయి ఉంటారని భావించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు కానీ వాళ్ళు తమ శక్తుల్ని ఉపయోగించి క్షేమంగా ద్వారకకి చేరుకుంటారు
6:08 మరోవైపు జరాసంధుడి విజయానికి కారణమైన అతని మిత్రులు హంస డింబకులు కూడా బలరాముడి కారణంగానే చనిపోతారు ఇది జరాసంధుడిని విపరీతమైన బాధకి గురి చేస్తుంది జరాసంధుడికి శిశుపాలుడు కూడా మంచి మిత్రుడే అతన్ని తన సేనాధిపతిగా నియమించుకుంటాడు తన పరాక్రమాన్ని చాటుకోవడానికి చాలా రాజ్యాలను జయించి ఆ రాజ్యాల రాజుల్ని బంధించి హింసించేవాడు అలాగే తాను చేసే రుద్రయాగం కోసం ఆ రాజుల్ని శివుడికి బలి ఇచ్చేవాడు ఇంకా ఆ రాజుల సంపదని సైన్యాన్ని తన నియంత్రణలో ఉంచుకునేవాడు ఇలా ఏ రాజ్యంలోనూ లేనంతగా అతి పెద్ద సైన్యాన్ని జరాసంధుడు కలిగి ఉండేవాడు తర్వాత కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ భీమ అండ్ జరాసంధ పాండవులు ఒకసారి రాజసూయ
6:54 యాగం చేయాలి అనుకుంటారు అయితే జరాసంధుడిని వధించనిదే ఈ యాగాన్ని తలపెట్టలేము అని శ్రీకృష్ణుడు అంటాడు ఎందుకంటే జరాసంధుడి దగ్గర అంతులేని సైన్యం ఉంది భవిష్యత్తులో జరగబోయేటువంటి కురుక్షేత్రానికి చాలా సైన్యం అవసరం అవుతుంది అలాగే ఎంతో మంది రాజుల మద్దతు కూడా కావాలి కానీ ఉన్న రాజులందరూ జరాసంధుడి వద్దే బంధీలుగా ఉన్నారు ఇక కురుక్షేత్ర యుద్ధంలో సపోర్ట్ చేయాల్సి వస్తే గనుక జరాసంధుడు ఖచ్చితంగా కౌరవుల పక్షాన ఉంటాడు అతని సైన్య బలం ముందు పాండవుల సైన్య బలం చాలా తక్కువ అందుకే కచ్చితంగా జరాసంధుడిని వధించాల్సిన అవసరం ఉంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు నిజానికి అయితే పాండవుల్లో ఏ ఒక్కరికి జరాసంధున్ని చంపే శక్తి లేదు అయితే మహాభారతంలో ఒకే నక్షత్రంలో ఐదుగురు మహావీరులు పుట్టారు వాళ్లే భీముడు
7:41 దుర్యోధనుడు జరాసంధుడు బకాసురుడు కీచకుడు అయితే వీరిలో మొదట ఎవరు ఎవరి చేతిలో చంపబడతారో మిగిలిన ముగ్గురు కూడా అతడి చేతిలోనే చనిపోతారు ఇక ఆల్రెడీ భీముడి చేతిలో బకాసురుడు మరణించాడు కాబట్టి జరాసంధుడు కూడా భీముడి చేతిలోనే చనిపోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపడం కోసం భీముడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి వద్దకు బయలుదేరుతాడు మగధ పొలిమేరకు చేరుకోగానే జరాసంధుడు పరిపాలిస్తున్న గిరివ్రజం వస్తుంది ఈ కొండ మీదే జరాసంధుడి కోట ఉంటుంది అయితే ఆ కోటని దాటి లోపలికి వెళ్లడం చాలా కష్టం శత్రువుల వారి నుండి తన కోటను రక్షించుకోవడానికి జరాసంధుడు ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకుంటాడు ముందుగా శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే ఆటోమేటిక్ గా డంకాలు
8:29 మోగుతాయి కృష్ణుడి ఆజ్ఞ మేరకు భీముడు వాటిని తన రొమ్ముతో చీల్చి పూర్తిగా ధ్వంసం చేస్తాడు తర్వాత వీళ్ళు రాజమార్గంలో కాకుండా వేరే మార్గంలో రాజధానిలోకి ప్రవేశిస్తారు ఇక జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే ఎంతో గౌరవం కచ్చితంగా వాళ్ళు ఏం అడిగినా సరే దానం ఇచ్చేసేవాడు అందుకే శ్రీకృష్ణుడు భీమార్జునులకి ఈ ఉపాయాన్ని చెప్తాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న వీళ్ళు ముగ్గురు జరాసంధుడిని కలిసి భిక్ష కోరుకుంటారు వాళ్ళు ఏం అడిగినా సరే తప్పకుండా ఇస్తాను అని మాటిస్తాడు జరాసంధుడు వెంటనే శ్రీకృష్ణుడు యుద్ధ భిక్ష కోరతాడు అందుకు జరాసంధుడు భీముడితో మల్ల యుద్ధం చేయడానికి అంగీకరిస్తాడు భీముడు జరాసంధుడు మధ్య మల్ల యుద్ధం మొదలవుతుంది 27 రోజుల పాటు వీళ్ళిద్దరూ భీకరంగా పోరాడుతారు ఎంతకీ
9:15 తగ్గకపోయేసరికి జరాసంధుడిని సగానికి చీల్చమని శ్రీకృష్ణుడు భీముడికి సూచనిస్తాడు వెంటనే భీముడు ఆ ప్రకారమే అతన్ని రెండు ముక్కల్లాగా చీల్చేస్తాడు అలా చీల్చిన రెండు సగాలని విసిరి పడేయగా మళ్ళీ అవి వచ్చి అతుక్కుంటాయి దీంతో జరాసంధుడు సజీవంగా మారి మళ్ళీ పోరాడుతాడు అలా రెండు సార్లు జరిగిన తర్వాత కృష్ణుడు మూడోసారి ఒక గడ్డి పరకను తీసుకొని చూపిస్తూ ఆ చీల్చిన శరీర భాగాల్ని వ్యతిరేక దిశలలో పడేయమని భీముడికి సైగ చేస్తాడు ఆ ప్రకారమే చేస్తాడు భీముడు అంతే ఇక ఆ చీలిన శరీర భాగాలు అతుక్కోకపోవడంతో జరాసంధుడు మరణిస్తాడు జరాసంధుడి మరణంతో శ్రీకృష్ణుడు చరసాలలో ఉన్న రాజులందరినీ విడిపిస్తాడు ఆయన కుమారుడైనటువంటి సహదేవున్ని రాజుని చేసి
10:02 మగధ సింహాసనం మీద కూర్చోబెడతాడు అతను పాండవులకు సామంత రాజుగా ఉంటాడు భీముడు జరాసంధుడు మధ్య ద్వంద్వ పోరాటం జరిగిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు ఇప్పటికీ ఆ ప్రదేశం ఒక లెజెండరీ ప్లేస్ లాగా నిలిచిపోయింది ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జరాసంధక ఆకార అని పిలుస్తారు ఇది బీహార్ రాష్ట్రంలోని రాజగిరి అనే పట్టణంలో ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ కథ నుండి మనం తెలుసుకునేటువంటి నీతి ఏంటంటే రెండు విడివిడి భాగాల్లాగా పుట్టినటువంటి పుట్టుక గొప్ప దైవ భక్తి కర్ణుడిని మించినటువంటి దానగుణం అత్యంత పరాక్రమవంతమైన వీరత్వం ఇన్ని గొప్ప గుణాలు కలిగి ఉన్నా సరే తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం అన్ని రాజ్యాలని ఆక్రమించుకోవడం యాగం పేరుతో అత్యంత క్రూరంగా రాజుల్ని బలి ఇవ్వడం చేత
10:48 చరిత్రలో ఈ జరాసంధుడు ఒక దుష్ట రాజులాగా మిగిలిపోయాడు మహాభారతంలో భీముడు మరియు జరాసంధుల పోరాటానికి సంబంధించిన ఈ కథ ప్రపంచంలో మంచిని రక్షించుకోవడం నికి చెడుని ఓడించడం చాలా అవసరం అని మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ మహాభారతం వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫో గిక్స్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్